RCB vs KKR | ఐపీఎల్లో భాగంగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. 93 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా 9 వికెట్ల తేడాతో కోహ్లీసేనను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన ఆరంభం నుంచే తడబడింది. రెండో ఓవర్లోనే కోహ్లీ ( 5) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అంతా తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఆది నుంచి బెంగళూరు వికెట్లు సమర్పించుకుంటూనే ఉండటంతో ఏ దశలోనూ కోలుకునే అవకాశం దక్కలేదు. డెవిలియర్స్ డకౌట్ అయ్యాడు. మ్యాక్స్వెల్ కూడా 10 పరుగులకే వికెట్ సమర్పించుకున్నాడు. బెంగళూరు తరఫున పడిక్కల్(22)దే అత్యధిక స్కోరు. మొత్తంగా కోహ్లీ సేన 92 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని పూర్తి చేసింది. శుభ్మన్ గిల్(48), వెంకటేశ్ అయ్యర్ (41*) రాణించారు. చివర్లో గిల్ అవుటైనా అప్పటికే కేకేఆర్ గెలుపు లాంఛనమైంది.