గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 20, 2020 , 20:06:30

యూఏఈ చేరుకున్న KKR, KXIP, RR జట్లు

యూఏఈ చేరుకున్న  KKR, KXIP, RR జట్లు

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13వ సీజన్‌ సందడి మొదలైంది.  ఎనిమిది ప్రాంఛైజీల్లోని  మూడు  జట్లు రాజస్థాన్‌ రాయల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ గురువారం యూఏఈలో అడుగుపెట్టాయి.  13వ సీజన్‌ సెప్టెంబర్‌ 19 నుంచి ఆరంభంకానుంది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకున్నాక కొన్నిరోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉండటంతో ముందుగానే ఆయా ఫ్రాంఛైజీలు యూఏఈకి చేరుకుంటున్నాయి.  చార్టర్‌ విమానాల్లో రాజస్థాన్‌, పంజాబ్‌ జట్లు దుబాయ్‌లో ల్యాండ్‌ అయ్యాయి. ఇవాళ సాయంత్రం కోల్‌కతా టీమ్‌ అబుధాబికి చేరుకున్నది. 


logo