సోమవారం 18 జనవరి 2021
Sports - Dec 31, 2020 , 01:55:01

కివీస్‌ ఉత్కంఠ విజయం

కివీస్‌ ఉత్కంఠ విజయం

మౌంట్‌ మాంగనీ: ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో పాకిస్థాన్‌పై న్యూజిలాండ్‌దే పైచేయి అయ్యింది.  నాటకీయ పరిణామాల మధ్య ముగిసిన తొలి టెస్టులో పాక్‌పై కివీస్‌ 101 పరుగుల తేడాతో విజయం సాధించింది.  కివీస్‌ నిర్దేశించిన 373 పరుగుల లక్ష్యఛేదన కోసం ఐదో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 71/3తో బరిలోకి దిగిన పాక్‌ 271 పరుగులకు ఆలౌటైంది. కివీస్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ ఫవాద్‌ ఆలమ్‌(102), కెప్టెన్‌ రిజ్వాన్‌(60) పోరాటపటిమ కనబరిచారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. డ్రా కోసం శాయశక్తులా పాక్‌ పోరాడితే..గెలుపే లక్ష్యంగా కివీస్‌ పట్టుదల ప్రదర్శించి గెలిచింది.