ఆదివారం 24 జనవరి 2021
Sports - Dec 06, 2020 , 00:19:08

విజయానికి చేరువలో కివీస్‌

విజయానికి చేరువలో కివీస్‌

హామిల్టన్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఘన విజయానికి చేరువైంది. తొలి ఇన్నింగ్స్‌లో 519 పరుగుల భారీ స్కోరు చేసిన ఆతిథ్య కివీస్‌.. వెస్టిండీస్‌ను త్వరగా ఔట్‌ చేసి ఫాలోఆన్‌లోనూ దెబ్బకొట్టింది. న్యూజిలాండ్‌ పేసర్ల వేగం, స్వింగ్‌ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ 138 పరుగులకే ఆలౌటైంది. 49/0తో శనివారం మూడో రోజు ఆటను కొనసాగించిన విండీస్‌ 89 పరుగులు మాత్రమే జోడించి పది వికెట్లు కోల్పోయింది. సీనియర్‌ పేసర్‌ టిమ్‌ సౌథీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఫాలోఆన్‌లోనూ విండీస్‌ 196 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. 89కే 6 వికెట్లు పడిన సమయంలో  బ్లాక్‌వుడ్‌(80నాటౌట్‌), జోసెఫ్‌(59నాటౌట్‌) విండీస్‌ను ఆదుకొని క్రీజులో నిలిచారు. 


logo