ఆదివారం 29 మార్చి 2020
Sports - Mar 02, 2020 , 06:34:03

లంచ్‌ విరామానికి కివీస్‌.. 46-0

లంచ్‌ విరామానికి కివీస్‌.. 46-0

క్రైస్ట్‌చర్చ్‌: ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్‌ విజయం దిశగా పయణిస్తోంది. 132 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. తొలి సెషన్‌ ముగిసే సమయానికి 15 ఓవర్లలో వికెట్లేమి నష్టపోకుండా 46 పరుగులు చేసింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌(16 బ్యాటింగ్‌), టామ్‌ బ్లండెల్‌(23 బ్యాటింగ్‌) ఇన్నింగ్స్‌కు అద్భుత ఆరంభానిచ్చారు. కివీస్‌ విజయానికి మరో 86 పరుగులు కావాలి. భారత బౌలర్లు అద్భుతం చేస్తే తప్ప న్యూజిలాండ్‌ విజయానికి ఢోకా లేనట్లే. ఇప్పటికే వన్డే సిరీస్‌ను వైట్‌వాష్‌ చేసిన కివీస్‌.. మరో విజయం సాధించి, టెస్ట్‌ సిరీస్‌ను కూడా వైట్‌వాష్‌ చేసేందుకు సన్నద్దమవుతోంది. 


logo