సోమవారం 06 ఏప్రిల్ 2020
Sports - Mar 15, 2020 , 00:20:01

ఆసీస్‌, కివీస్‌ సిరీస్‌ రద్దు

 ఆసీస్‌, కివీస్‌ సిరీస్‌ రద్దు

మెల్‌బోర్న్‌: ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న మహమ్మారి కరోనా వైరస్‌ ధాటికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌ అర్ధాంతరంగా ముగిసింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం తొలి వన్డే జరుగగా.. సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలున్న విషయం తెలిసిందే. కివీస్‌ గడ్డపై అడుగుపెట్టే వారిని కచ్చితంగా 14 రోజుల పాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచాలని ఆ దేశ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆంక్షలు మొదలవడానికి ముందే స్వదేశానికి వెళ్లాలని కివీస్‌ క్రికెటర్లు నిర్ణయించుకున్నారు. ‘న్యూజిలాండ్‌ ప్రభుత్వం విధించిన పర్యాటక ఆంక్షల నేపథ్యంలో కివీస్‌ జట్టు స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. అందుకు మేం సమ్మతించాం’అని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో వన్డే సిరీస్‌తో పాటు ఇరు జట్ల మధ్య జరుగాల్సిన టీ20 సిరీస్‌ కూడా రైద్దెంది.


ఫెర్గూసన్‌కు కరోనా నెగిటివ్‌

ఆసీస్‌తో తొలి వన్డే సందర్భంగా అస్వస్థతకు గురైన న్యూజిలాండ్‌ పేసర్‌ ఫెర్గూసన్‌కు కొవిడ్‌-19 నెగిటివ్‌ అని తేలింది. శుక్రవారం నుంచి ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్న ఫెర్గూసన్‌ పరిస్థితి నిలకడగా ఉండటంతో అతడికి న్యూజాలాండ్‌ వెళ్లేందుకు అనుమతి లభించినైట్లెందని కివీస్‌ క్రికెట్‌ బోర్డు తెలిపింది. 


logo