బుధవారం 27 జనవరి 2021
Sports - Dec 04, 2020 , 00:31:00

కివీస్‌ 243/2

కివీస్‌ 243/2

హామిల్టన్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ భారీ స్కోరు దిశగా దూసుకెళుతున్నది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న కివీస్‌..తొలి రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. 14 పరుగులకే ఓపెనర్‌ యంగ్‌(5) వికెట్‌ కోల్పోయిన కివీస్‌ను టామ్‌ లాథమ్‌(86), కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(97 నాటౌట్‌) ఆదుకున్నారు. వీరిద్దరు విండీస్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. లాథమ్‌ను రోచ్‌(1/53) బౌల్డ్‌ చేయడంతో రెండో వికెట్‌కు 154 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. ఆ తర్వాత..రాస్‌ టేలర్‌(31 నాటౌట్‌)తో కలిసి విలియమ్సన్‌.. ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. 


logo