బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Jul 31, 2020 , 00:30:48

శిక్షకు 5 లక్షల ఆర్థిక సహాయం

శిక్షకు 5 లక్షల ఆర్థిక సహాయం

న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన యువ వుషూ ప్లేయర్‌ శిక్ష కష్టాలు తీరాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో తినడానికి తిండి లేక పూటగడిచేందుకు దినసరి వ్యవసాయ కూలీగా మారిన శిక్షకు కేంద్ర క్రీడాశాఖ బాసటగా నిలిచింది. శిక్ష ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు రూ.5 లక్షల ఆర్థిక సాయమందించారు. జాతీయ వుషూ చాంపియన్‌షిప్‌లో 24 స్వర్ణ పతకాలు సాధించిన ఈ యువ ప్లేయర్‌కు పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ జాతీయ సంక్షేమ నిధి కింద మొత్తాన్ని మంజూరు చేశారు. ఈ సందర్భంగా శిక్ష మాట్లాడుతూ ‘కేంద్ర క్రీడాశాఖ చేసిన ఆర్థిక సహాయానికి నాకు మాటలు రావడం లేదు. అథ్లెట్ల సమస్య పట్ల మంత్రి చూపించిన చొరవ మరువలేనిది. ఏడాదిలోపు దేశం తరఫున కచ్చితంగా పసిడి పతకం సాధిస్తానని మాట ఇస్తున్నాను’ అని అంది. 


logo