శనివారం 28 నవంబర్ 2020
Sports - Sep 20, 2020 , 19:52:28

యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌గేల్‌ లేకుండానే..

యూనివర్సల్‌ బాస్‌  క్రిస్‌గేల్‌ లేకుండానే..

దుబాయ్‌: ఐపీఎల్‌-2020 సీజన్‌ రెండో మ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మధ్య జరుగుతోంది. టాస్‌ గెలిచిన పంజాబ్‌ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకున్నది. వెస్టిండీస్ విధ్వంస‌క ఓపెనర్, యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్ ‌గేల్‌కు పంజాబ్‌  తుది జట్టులో చోటు దక్కలేదు. బౌలర్ ఎవరైనా చుక్కలు చూపించే గేల్‌ను బెంచ్‌కే పరిమితం చేయడం  అభిమానులు  నిరాశపరిచింది. మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల సత్తా కలిగిన గేల్‌ క్రీజులో కొద్దిసేపు ఉంటే మైదానంలో పరుగుల పండుగే. 

పంజాబ్‌లో నలుగురు విదేశీ ఆటగాళ్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, నికోలస్‌ పూరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, షెల్డన్‌ కాట్రెల్‌ ఉన్నారు. దీంతో తుది జట్టులో అతనికి చోటు దక్కలేదు. 2019లో ఢిల్లీతో మ్యాచ్‌లో  వీరవిహారం చేసిన గేల్‌ 37 బంతుల్లోనే 69 రన్స్‌ చేశాడు.