బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 04, 2020 , 19:07:18

KXIPvCSK: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

KXIPvCSK: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌

దుబాయ్: ఐపీఎల్‌-13 సీజన్‌లో మరో ఆసక్తికర సమరం ఆరంభమైంది.  దుబాయ్‌ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడుతున్నాయి. హ్యాట్రిక్‌ ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న చెన్నై తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగుతున్నది.   మరోవైపు పంజాబ్‌ కూడా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి ఢీలాపడింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి గెలుపుబాట పట్టాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు.