బుధవారం 25 నవంబర్ 2020
Sports - Oct 20, 2020 , 15:30:09

IPL 2020: ధనాధన్‌ ఢీ..పంజాబ్‌కు ఢిల్లీ సవాల్‌

IPL 2020: ధనాధన్‌ ఢీ..పంజాబ్‌కు ఢిల్లీ సవాల్‌

దుబాయ్‌: ఐపీఎల్‌-13లో ఇవాళ రసవత్తర పోరు జరగనుంది.  గత మ్యాచ్‌ల్లో ధనాధన్‌ ఆటతో ప్రత్యర్థులను బెంబేలెత్తించిన   కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్లు   తలపడనున్నాయి.  శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్సీలోని  ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా  కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని  పంజాబ్‌ జట్టు   ప్లేఆఫ్ బెర్తు  కోసం పోరాడుతోంది.   ముంబై ఇండియన్స్‌తో  డబుల్‌ సూపర్‌ ఓవర్‌లో పంజాబ్‌  ఉత్కంఠ విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉంది. సీజన్‌ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై  ఢిల్లీ   సూపర్‌ ఓవర్‌లో నెగ్గిన విషయం తెలిసిందే.

ప్లే ఆఫ్‌‌ రేసులో నిలవాలంటే పంజాబ్‌  ప్రతీ మ్యాచ్‌‌ నెగ్గాల్సిన పరిస్థితి నెలకొంది. కెప్టెన్‌ రాహుల్‌, ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ శుభారంభం అందిస్తుండగా ద్వితీయార్థంలో జట్టులోకి వచ్చిన విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ క్రిస్‌గేల్‌ స్థాయికి తగ్గప్రదర్శన చేస్తున్నాడు.  ఆల్‌రౌండర్‌ మాక్స్‌వెల్‌   ‌ పేలవ ఫామ్‌‌ జట్టును దెబ్బతీస్తోంది. డెత్‌ ఓవర్లలో పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయాల్సి ఉంది.  పంజాబ్‌ కన్నా ఢిల్లీ బౌలింగ్‌ లైనప్‌ బలంగా ఉంది. ముఖ్యంగా స్పీడ్‌స్టర్‌ రబాడను ఎదుర్కోవడం ఆ జట్టుకు సవాలే.

మరోవైపు ఆడిన  9 మ్యాచ్‌‌ల్లో ఏడు  విజయాలతో ఢిల్లీ  జోష్‌లో ఉంది.  గత మ్యాచ్‌లో  చెన్నైపై విజయంతో ప్లేఆఫ్‌‌కు చేరువైన ఆ జట్టు పంజాబ్‌‌ను ఓడించి బెర్తును ఖాయం చేసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఢిల్లీ జట్టు  బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్ఠంగా ఉంది. ఇరుజట్లలో బ్యాట్స్‌మెన్‌, బౌలర్లు తమదైన శైలిలో దుమ్మురేపుతుండటంతో మ్యాచ్‌ రసవత్తరంగా సాగనుంది.