ఆదివారం 23 ఫిబ్రవరి 2020
పతకం ఖాయం

పతకం ఖాయం

Feb 15, 2020 , 00:32:58
PRINT
 పతకం ఖాయం
  • ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌

మనీలా (ఫిలిప్పీన్స్‌): ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు పతకం ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో 3-2తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసిన భారత్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో బరిలోకి దిగిన సాయిప్రణీత్‌  14-21, 21-14, 12-21తో వాంగ్‌చరోన్‌ చేతిలో ఓడాడు. రెండో సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 20-22, 14-21తో కున్లావత్‌ వితిద్‌సరన్‌ చేతిలో వరుస గేమ్‌ల్లో పరాజయం పాలవడంతో భారత్‌ 0-2తో వెనుకంజలో పడింది. పురుషుల డబుల్స్‌లో అర్జున్‌-ధృవ్‌ జోడి 21-18, 22-20తో కిట్టినుపోంగ్‌-విరియాంగ్‌కురా జంటపై నెగ్గగా.. మూడో సింగిల్స్‌ మ్యాచ్‌లో యువ ఆటగాడు లక్ష్యసేన్‌ 21-19, 21-18తో సుప్పను విశింగ్‌సనోన్‌పై గెలిచాడు. దీంతో భారత్‌ 2-2తో పోటీలోకి వచ్చింది. రెండో డబుల్స్‌ మ్యాచ్‌లో శ్రీకాంత్‌-చిరాగ్‌ శెట్టి జోడీ 21-15, 16-21, 21-15తో మనీపాంగ్‌-నిపిట్‌ఫాన్‌ ద్వయంపై నెగ్గడంతో భారత్‌ విజయం ఖాయమైంది. సెమీస్‌లో మనవాళ్లు ఇండోనేషియాతో తలపడనున్నారు  logo