బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 12, 2020 , 00:02:28

భారత్‌ బోణీ

భారత్‌ బోణీ
  • ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌

మనీలా (ఫిలప్పీన్స్‌): ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ ముందుండి నడిపించడంతో ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన గ్రూప్‌-బి టైలో భారత జట్టు 4-1తో కజకిస్థాన్‌పై గెలుపొందింది. ఈ విజయంతో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌ అవకాశాలను మెరుగుపరుచుకుంది. సింగిల్స్‌ విభాగంలో శ్రీకాంత్‌తో పాటు, లక్ష్యసేన్‌, శుభంకర్‌ డే విజయాలు సాధించారు. శ్రీకాంత్‌ 21-10, 21-7తో దిమిత్రి పనరిన్‌పై 23 నిమిషాల్లోనే గెలుపొందగా.. లక్ష్యసేన్‌ 21-13, 21-8తో 21 నిమిషాల్లోనే అర్తుర్‌ నియోజోవ్‌ను మట్టికరిపించాడు. శుభంకర్‌ 21-11, 21-5తో కుల్మతోవ్‌పై నెగ్గాడు. డబుల్స్‌ విభాగంలో సాయి ప్రణీత్‌-చిరాగ్‌ శెట్టి జోడీ 21-18, 16-21, 19-21తో నియాజోవ్‌-పనరిన్‌ జంట చేతిలో ఓడగా.. అర్జున్‌-ధృవ్‌ ద్వయం 21-14, 21-8తో నికిత బ్రాగిన్‌-కుల్మతోవ్‌ జోడీపై నెగ్గింది. భారత జట్టు తదుపరి మ్యాచ్‌లో గురువారం మలేషియాతో తలపడనుంది.


logo
>>>>>>