ఆదివారం 05 జూలై 2020
Sports - Apr 25, 2020 , 10:33:45

సాయం చేసిన ఖో-ఖో సంఘం

సాయం చేసిన ఖో-ఖో సంఘం

ముంబై: క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో.. క‌ష్టాలు ప‌డుతున్న ఖో-ఖో ప్లేయ‌ర్ న‌స్రీన్ కుటుంబాన్ని ఖో-ఖో జాతీయ సంఘం (కేకేఎఫ్ఐ) ఆర్థిక సాయం అందించింది. గతేడాది ఖాట్మండు వేదిక‌గా జ‌రిగిన ద‌క్షిణాసియా క్రీడ‌ల్లో స్వ‌ర్ణం నెగ్గిన భార‌త జ‌ట్టు స్టార్ డైవ‌ర్‌ న‌స్రీన్ కుటుంబం‌.. లాక్‌డౌన్ కార‌ణంగా ప‌నులు లేక‌పోవ‌డంతో ప‌స్తులు ఉండాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. విష‌యం తెలుసుకున్న కేకేఎఫ్ఐ ఆమెకు ల‌క్ష రూపాయ‌లు అందించింది. 

`దేశం కోసం నేను ఎంతో క‌ష్ట‌ప‌డ్డాను. కానీ లాక్‌డౌన్ కార‌ణంగా మా కుటుంబం ప్ర‌స్తుతం ఇబ్బందుల్లో ఉంది. తిన‌డానికి తిండి కూడా లేని ప‌రిస్థితి నెల‌కొంది` అని ఆమె శుక్ర‌వారం ఉద‌యం తెలుప‌గా.. సాయంత్రానికి కేకేఎఫ్ఐ ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దును ఆమె అకౌంట్‌లో వేసింది. ఆట‌గాళ్ల సంక్షేమం కోసం మేం ఎప్పుడూ ముందుంటాం అని కేకేఎఫ్ఐ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 


logo