ఆదివారం 29 మార్చి 2020
Sports - Feb 29, 2020 , 00:17:23

టెన్నిస్‌లో ఓయూకు స్వర్ణం

 టెన్నిస్‌లో ఓయూకు స్వర్ణం

భువనేశ్వర్‌: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు మెరిశారు. శుక్రవారం జరిగిన టెన్నిస్‌ టీమ్‌ ఈవెంటులో ఓయూ 2-1తో గుజరాత్‌ యూనివర్సిటీపై గెలిచి స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. సింగిల్స్‌ ఫైనల్లో అనూష 4-6, 6-7తో దీప్‌శిఖా షా చేతిలో ఓడగా శ్రావ్య శివానీ   6-0, 7-6 ఇష్వారి సేత్‌పై గెలిచింది. డబుల్స్‌ లో అనూష, శివానీ ద్వయం 6-4, 6-3 ఇష్వారి, దీప్‌శిఖా జోడీపై విజయాన్నందుకుంది. 


logo