శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 25, 2020 , 00:45:20

జాతీయ నెట్‌బాల్‌ సంఘం ఉపాధ్యక్షుడిగా ఖాజాఖాన్‌

జాతీయ నెట్‌బాల్‌ సంఘం ఉపాధ్యక్షుడిగా ఖాజాఖాన్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: జాతీయ నెట్‌బాల్‌ సంఘం ఉపాధ్యక్షుడిగా రాష్ట్రానికి చెందిన మహమ్మద్‌ ఖాజాఖాన్‌ ఎన్నికయ్యారు. సోమవా రం జరిగిన ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో నాలుగేండ్ల (2020 -24) పదవీకాలానికి సభ్యులను ఎన్నుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ నెట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా కొనసాగుతున్న ఖాజాఖాన్‌ నియామకంపై పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షుడిగా వాగిశ్‌ పాఠక్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా హరిఓం కౌశిక్‌, సంయుక్త కార్యదర్శిగా విజేందర్‌ సింగ్‌ ఎన్నికయ్యారు.  


logo