బుధవారం 08 జూలై 2020
Sports - May 18, 2020 , 19:59:01

అతడు స్థాయికి తగ్గట్టు ఎప్పుడూ ఆడలేదు: రికీ

అతడు స్థాయికి తగ్గట్టు ఎప్పుడూ ఆడలేదు: రికీ

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ఉస్మాన్‌ ఖవాజా స్థాయికి తగ్గట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణించలేకపోయాడని ఆ దేశ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డాడు. నిలకడ లేమి కారణంగా ఖవాజా.. ఆసీస్‌ జట్టు నుంచి వేటుకు గురయ్యాడని అన్నాడు. గతేడాది యాషెస్‌ మధ్యలోనే జట్టులో చోటు కోల్పోయిన ఖవాజా... తాజాగా ఆస్ట్రేలియా వార్షిక కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితాలోనూ చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ విషయంపై పాంటింగ్‌ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.

'అతడు మళ్లీ ఆస్ట్రేలియా జట్టులోకి రావడం చాలా కష్టం. అతడి పట్ల నాకు బాధగా ఉంది. ఖవాజా చాలా గొప్ప ప్లేయర్‌. అయితే అంతర్జాతీయ స్థాయిలో అతడిలో అత్యుత్తమ ఆటను మేం ఎప్పుడూ చూడలేదు. అప్పుడప్పుడూ బాగానే ఆడిన నిలకడగా రాణించలేకపోయాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించి.. భారీగా పరుగులు చేసి.. ఆసీస్‌ జట్టులో అవకాశం కోసం అతడు మళ్లీ ఎదురుచూడాలి' అని పాంటింగ్‌ చెప్పాడు. ఖవాజా ఆస్ట్రేలియా తరఫున 44 టెస్టులు, 40వన్డేలు ఆడాడు,  


logo