సోమవారం 08 మార్చి 2021
Sports - Jan 20, 2021 , 12:11:28

మా టీమ్‌తో జాగ్ర‌త్త‌.. టీమిండియాకు పీట‌ర్స‌న్ వార్నింగ్‌

మా టీమ్‌తో జాగ్ర‌త్త‌.. టీమిండియాకు పీట‌ర్స‌న్ వార్నింగ్‌

ముంబై: ఆస్ట్రేలియాపై సంచ‌ల‌న విజ‌యం సాధించి సంబ‌రాలు చేసుకుంటున్న ఇండియ‌న్ టీమ్‌కు ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ ఓ ఫ్రెండ్లీ వార్నింగ్ ఇచ్చాడు. అది కూడా హిందీ కావ‌డం విశేషం. త్వ‌ర‌లోనే ఇంగ్లండ్ టీమ్ ఇండియాకు రానున్న నేప‌థ్యంలో అత‌డు చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ఇండియా.. ఈ చారిత్ర‌క విజ‌యాన్ని బాగా సెల‌బ్రేట్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఎన్నో అడ్డంకుల మ‌ధ్య సాధించిన విజ‌యం. కానీ అస‌లు సవాలు మీకు కొన్ని వారాల్లో ఎదురు కాబోతోంది. ఇంగ్లండ్ టీమ్ వ‌స్తోంది. ఆ టీమ్‌ను మీ సొంత‌గ‌డ్డ‌పై ఓడించాల్సి ఉంటుంది. జాగ్ర‌త్త‌, ఈ రెండు వారాల్లో మ‌రీ ఎక్కువ‌గా సెల‌బ్రేట్ చేసుకోవ‌ద్దు అని పీట‌ర్స‌న్ హిందీలో ట్వీట్ చేశాడు. 

నాలుగు టెస్ట్‌లు, ఐదు టీ20లు, మూడు వ‌న్డేల్లో ఆడ‌టానికి ఇంగ్లండ్ టీమ్ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి టెస్ట్ ఫిబ్ర‌వ‌రి 5న చెన్నైలో ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే తొలి రెండు టెస్ట్‌ల కోసం టీమ్‌ను ప్ర‌క‌టించారు. ఆస్ట్రేలియా టూర్ మ‌ధ్య‌లోనే వెళ్లిపోయిన విరాట్ కోహ్లి మ‌ళ్లీ కెప్టెన్సీ వ‌హించ‌నుండ‌గా.. పాండ్యా, ఇషాంత్ శ‌ర్మ తిరిగి టీమ్‌లోకి వ‌చ్చారు. తొలి రెండు టెస్ట్‌లు చెన్నైలో, ఆ త‌ర్వాతి రెండు టెస్టులు, టీ20లు అహ్మ‌దాబాద్‌లోని మొతేరాలో, మూడు వ‌న్డేలు పుణెలో జ‌ర‌గ‌నున్నాయి. 


ఇవి కూడా చ‌ద‌వండి

వావ్ టీమిండియా.. ఆకాశానికెత్తిన‌ ఆస్ట్రేలియన్ మీడియా

డ్రెస్సింగ్ రూమ్‌లో ర‌విశాస్త్రి స్పీచ్ చూశారా.. వీడియో

హిందూ మ‌తాన్ని కించ ప‌రిచారు.. శిక్ష త‌ప్ప‌దు!

బిలియ‌నీర్ జాక్‌మా క‌నిపించారు..

VIDEOS

logo