శనివారం 23 జనవరి 2021
Sports - Nov 27, 2020 , 02:57:59

కేరళ, నార్త్‌ ఈస్ట్‌ మ్యాచ్‌ డ్రా

కేరళ, నార్త్‌ ఈస్ట్‌ మ్యాచ్‌ డ్రా

పనాజీ: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌)లో హోరాహోరీ మ్యాచ్‌లు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. గురువారం కేరళ బ్లాస్టర్స్‌, నార్త్‌ఈస్ట్‌ యునైటెడ్‌(ఎన్‌ఈయుఎఫ్‌సీ) మధ్య జరిగి మ్యాచ్‌ ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగింది. విజయం కోసం కడదాకా కొట్లాడిన పోరు చివరకు 2-2తో డ్రాగా ముగిసింది. కేరళ తరఫున సీడో (5ని), హుపర్‌ (45ని), నార్త్‌ ఈస్ట్‌ జట్టులో అపె (51ని), సిల్లా  గోల్స్‌ నమోదు చేశారు. మ్యాచ్‌లో 2-1తో చివరి వరకు ఆధిక్యం కొనసాగించిన కేరళకు.. సిల్లా షాకిచ్చాడు. అద్భుత గోల్‌తో మ్యాచ్‌ను డ్రా చేశాడు. దీంతో ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లాడిన నార్త్‌ఈస్ట్‌ 4 పాయింట్లతో టాప్‌లో ఉంది. 


logo