గురువారం 09 జూలై 2020
Sports - May 10, 2020 , 09:38:58

ఎప్పుడు మొదలైనా సిద్ధం: కోహ్లీ

ఎప్పుడు మొదలైనా సిద్ధం: కోహ్లీ

న్యూఢిల్లీ: కరోనా కారణంగా నిలిచిపోయిన క్రికెట్ పోటీలు మళ్లీ ఎప్పుడు ప్రారంభమైనా తాను సిద్ధంగానే ఉంటానని టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. శారీరకంగా ఫిట్​గానే ఉన్నానని, సానుకూలంగా ఉంటూ మానసిక దృఢత్వంపై దృష్టిసారించానని ఓ టీవీ షోలో చెప్పాడు.

“అదృష్టవశాత్తు ఇంట్లో జిమ్​ పరికరాలు మొత్తం ఉన్నాయి. కసరత్తులు చేస్తున్నా. అందుకే ఫిట్​నెస్​కు వచ్చిన సమస్యలేదు. నెట్స్​లో గంటల కొద్దీ ప్రాక్టీస్ కన్నా మన మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికే ఇష్టపడతా. మానసిక స్థితి బాగుంటే సానుకూలంగా ఆలోచించగలం. ఆట మళ్లీ ఎప్పుడు ప్రారంభమైనా నేను ఆడేందుకు పూర్తి సిద్ధంగా ఉంటా. ఎక్కడ ఆపానో అక్కడి నుంచి మొదలుపెట్టేందుకు ఇబ్బందేం లేదు” అని కోహ్లీ చెప్పాడు. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 13వ సీజన్ సహా క్రికెట్ పోటీలన్నీ నిలిచిపోయాయి. 


logo