యువత ఆల్రౌండర్లా ఉండాలి

- రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు
- సీఎం కేసీఆర్ క్రికెట్ కప్ ప్రారంభం
సిద్దిపేట, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): చదువు, క్రీడలు, సామాజిక బాధ్యతలో చురుకుగా ఉంటూ యువతీ యువకులందరూ ఆల్రౌండర్లుగా ముందుకుసాగాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ రోల్ మోడల్ అని, రాష్ర్టాన్ని ఆయన అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని చెప్పా రు. సీఎం కేసీఆర్ జన్మదినం (ఈ నెల 17) సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆచార్య జయశంకర్ స్టేడియంలో కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీని ఆదివారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. జిల్లాపరిషత్ అధ్యక్షురాలు రోజాశర్మతో కలిసి ఆయన ట్రోఫీని ఆవిష్కరించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడారు. నిబద్ధత, పట్టుదలతో పని చేస్తే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని అన్నారు. టీమ్ఇండియా తరఫున అద్భుతంగా రాణిస్తున్న హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ గురించి ఆయన ప్రస్తావించారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని అతడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడని, క్రీడలను సీరియస్‌గా తీసుకుంటే ఏం సాధించవచ్చో నిరూపించాడని మంత్రి గుర్తు చేశారు. సిద్దిపేటలో అత్యున్నత స్టేడియాన్ని ఏర్పాటు చేశామని, ఇది ఇక్కడి క్రీడాకారులకు మంచి అవకాశమన్నారు. ఈ టోర్నీలో రాణించే ప్లేయర్లను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ క్రికెట్ కప్ టోర్నీ సోమవారం నుంచి పది రోజులు సాగనుంది.
తాజావార్తలు
- పీఎఫ్ వడ్డీరేటు 8.5 శాతమే
- టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ఉర్దూ టీచర్స్ అసోసియేషన్
- ఆటగాళ్లకు కరోనా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ వాయిదా
- చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
- చెన్నై చేరుకున్న ధోనీ, రాయుడు..త్వరలో ట్రైనింగ్
- రాఫెల్ స్ఫూర్తితో.. ‘పంజాబ్ రాఫెల్’ వాహనం
- కురుమల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ : ఎమ్మెల్సీ కవిత
- టీ బ్రేక్..ఇంగ్లాండ్ 144/5
- ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్.. ఇండియాలో బెంగళూరే బెస్ట్
- ఉప్పెన చిత్ర యూనిట్‌కు బన్నీ ప్రశంసలు