అడిలైడ్: ఆస్ట్రేలియన్ టీనేజర్ కేలీ మెక్కెవోన్ మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డు బద్దలుకొట్టింది. ఆస్ట్రేలియన్ ఒలింపిక్ ట్రయల్స్‌లో కేలీ 57.45 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరి.. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రేగన్ స్మిత్ (57.57 సెకన్లు) సృష్టించిన రికార్డును తుడిచేసింది. కాగా గతేడాది మృతి చెందిన తన తండ్రికి ఈ ఘనతను అంకితమిస్తున్నానని 19 ఏండ్ల మెక్కెవోన్ భావోద్వేగంగా చెప్పింది.