సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 28, 2020 , 00:53:35

మోహన్‌రావు కుటుంబానికి మాజీ ఎంపీ కవిత పరామర్శ

మోహన్‌రావు కుటుంబానికి మాజీ ఎంపీ కవిత పరామర్శ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన తెలంగాణ బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రావు కుటుంబాన్ని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. గురువారం మోహన్‌రావు ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. క్రీడా అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమం కోసం మోహన్‌రావు నిరంతరం కృషి చేసేవారని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆయన మృతి తీరని లోటని, కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని కవిత భరోసా ఇచ్చారు.    


logo