శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Oct 31, 2020 , 02:14:36

ఫైనల్లో కవిందర్‌, సంజీత్‌

ఫైనల్లో కవిందర్‌, సంజీత్‌

న్యూఢిల్లీ: అలెక్సిస్‌ వసైన్‌ (ఫ్రాన్స్‌) అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో భారత బాక్సర్లు కవిందర్‌సింగ్‌ (57 కేజీలు), సంజీత్‌ (91 కేజీలు), అమిత్‌ పంగల్‌ (52 కేజీలు) ఫైనల్‌కు దూసుకెళ్లారు. సెమీఫైనల్లో కవిందర్‌ 3-0తో జార్జ్‌ (ఫ్రాన్స్‌)పై గెలువగా.. సంజీత్‌ 2-1తో ఫల్గమ్‌ (అమెరికా)పై విజయం సాధించాడు. ఫైనల్లో  కిస్తోరి (ఫ్రాన్స్‌)తో కవిందర్‌.. సోహెబ్‌ బుఫియా (ఫ్రాన్స్‌)తో సంజీత్‌ తలపడనున్నారు. కరోనా వైరస్‌ కారణంగా సుదీర్ఘ విరామం అనంతరం బరిలో దిగిన తొలి టోర్నీలో నలుగురు భారత బాక్సర్లు పాల్గొనగా అందులో ముగ్గురు ఫైనల్‌ చేరారు. మరో బాక్సర్‌ శివ తాపా(63 కేజీలు) సెమీస్‌లో ఓడి కాంస్యం చేజిక్కించుకున్నాడు.