బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 05, 2020 , 00:01:41

కౌల్‌ హ్యాట్రిక్‌

కౌల్‌ హ్యాట్రిక్‌

పటియాలా: ఆంధ్రతో మంగళవారం మొదలైన రంజీ మ్యాచ్‌లో పంజాబ్‌ స్పీడ్‌స్టర్‌ సిద్దార్థ్‌ కౌల్‌(5/24) హ్యాట్రిక్‌తో అదరగొట్టాడు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆంధ్ర..కౌల్‌ ధాటికి 39.4 ఓవర్లలో 97 పరుగులకు కుప్పకూలింది. ఇన్నింగ్స్‌ 40వ ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో శశికాంత్‌(20), స్వరూప్‌(0), అశిష్‌(0)ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన పంజాబ్‌..షోయబ్‌ ఖాన్‌(5/46), అశిష్‌(5/50) ధాటికి 108 పరుగులకు ఆలౌటైంది. తిరిగి రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆంధ్ర తొలి రోజు ఆట ముగిసే సరికి 31 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. 


జాఫర్‌ @ 12000 

విదర్భ సీనియర్‌ క్రికెటర్‌ వసీం జాఫర్‌ సరికొత్త చరిత్ర లిఖించాడు. రంజీ ట్రోఫీలో 12వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాట్స్‌మన్‌గా జాఫర్‌ రికార్డు నెలకొల్పాడు. 


logo
>>>>>>