శనివారం 28 నవంబర్ 2020
Sports - Nov 22, 2020 , 00:33:12

సైకిల్‌పై కశ్మీర్‌ టు కన్యాకుమారి

సైకిల్‌పై కశ్మీర్‌ టు కన్యాకుమారి

  • 8 రోజుల 7 గంటల్లో 3,600 కి.మీ. 
  • 17 ఏండ్ల ఓం మహాజన్‌ నయా రికార్డు

ముంబై: సాధారణంగా పదిహేడేండ్ల కుర్రాడంటే కాలేజీకి వెళ్లడం.. స్నేహితులతో ఆడుకోవడం.. సినిమాలు చూడటం ఇలాం టి నిత్యకృత్యాల్లో మునిగిపోతుంటారు.. కానీ మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఓం మహాజన్‌ మాత్రం రికార్డులు తిరగరాసే పనిలో ఉన్నా డు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 3,600 కిలోమీటర్ల దూరాన్ని ఎనిమిది రోజుల 7 గంటల 38 నిమిషాల్లో సైకిల్‌పై పూర్తిచేసిన ఓం మహాజన్‌.. అతి తక్కువ వ్యవధిలో ఈ ఫీట్‌ సాధించిన సైక్లిస్ట్‌గా రికార్డుల్లోకెక్కాడు. గత వారం శ్రీనగర్‌లో ప్రారంభమైన అతడి సైకిల్‌ యాత్ర శనివారం మధ్యాహ్నం కన్యాకుమారిలో ముగిసింది. ఈ క్రమంలో ఎముకలు కొరికే చలిని, జోరు వర్షాన్ని, మండుటెండను రుచిచూసిన ఓం మహాజన్‌.. కుటుంబ సభ్యుల తోడ్పాటుతోనే ఈ ఘనత సాధించానన్నాడు. గతంలో ఈ రికార్డు లెఫ్టినెంట్‌ కర్నల్‌ భరత్‌ పన్ను (8 రోజుల 9 గంటలు) పేరిట ఉంది.