బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Mar 02, 2020 , 00:12:02

కర్ణాటక 122 ఆలౌట్‌

కర్ణాటక 122 ఆలౌట్‌
  • -బెంగాల్‌తో రంజీ సెమీఫైనల్‌

కోల్‌కతా: బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న కర్ణాటక జట్టు రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో అనూహ్యంగా తడబడింది. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుతున్న సెమీస్‌లో బెంగాల్‌ యువ పేసర్‌ ఇషాన్‌ పొరెల్‌ (5/39) విజృంభించడంతో.. కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 122 పరుగులకు ఆలౌటైంది. లోకేశ్‌ రాహుల్‌ (26), కరుణ్‌ నాయర్‌ (3), మనీశ్‌ పాండే (12), పడిక్కల్‌ (4), సమర్థ్‌ (0), సిద్ధార్థ్‌ (14) శరత్‌ (1) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. బెంగాల్‌ బౌలర్లలో ఇషాన్‌ పొరెల్‌ (5/39) చెలరేగిపోయాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన బెంగాల్‌ ఆదివారం ఆట ముగిసే సమయానికి 72/4తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 190 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని బెంగాల్‌ ప్రస్తుతం 262 పరుగుల ముందంజలో ఉంది. సౌరాష్ట్రతో జరుగుతున్న మరో సెమీఫైనల్లో గుజరాత్‌ 119/6తో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 304 రన్స్‌ చేసిన సౌరాష్ట్ర 185 పరుగుల ఆధిక్యంలో ఉంది.


logo
>>>>>>