మంగళవారం 07 జూలై 2020
Sports - May 01, 2020 , 16:09:24

క‌పిల్‌దేవ్‌తో పోలికా..!

క‌పిల్‌దేవ్‌తో పోలికా..!

హార్దిక్ పాండ్యా ఆ ద‌రిదాపుల్లో కూడా లేడు

పాక్ మాజీ ఆల్‌రౌండ‌ర్ అబ్దుల్ రజాక్ వ్యాఖ్య‌

క‌రాచీ:  దిగ్గ‌జ ఆల్‌రౌండ‌ర్లు కపిల్‌దేవ్‌, ఇమ్రాన్ ఖాన్‌ల‌తో  హార్దిక్ పాండ్యాను పోల్చ‌డం స‌రికాద‌ని పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండ‌ర్ అబ్దుల్ రజాక్  పేర్కొన్నాడు. ఆల్‌రౌండ‌ర్‌గా నిరూపించుకోవాల్సిన స‌మ‌యంలో పాండ్యా గాయాల‌తో సావాసం చేస్తున్నాడ‌ని.. విప‌రీత‌మైన డ‌బ్బు వ‌ల్ల యువ ఆట‌గాళ్ల‌కు ఆట మీద కంటే ఇత‌రాత్ర అంశాల‌పై ఫోక‌స్ ఎక్కువైంద‌ని ర‌జాఖ్ అన్నాడు. 

`హార్దిక్ పాండ్యాను దిగ్గ‌జ ఆల్‌రౌండ‌ర్ క‌పిల్ దేవ్‌తో పోల్చ‌డం హాస్యాస్ప‌దం. ఇమ్రాన్ భాయ్‌, క‌పిల్ పాజీ దిగ్గ‌జ ఆల్‌రౌండ‌ర్లు నేను కూడా ఆల్‌రౌండ‌ర్‌నే అలాఅని.. వారితో పోల్చుకుంటానా. పాండ్యా ఇంకా చాలా మెరుగ‌వ్వాలి. బుమ్రాపై నాకు ఎలాంటి వ్య‌క్తిగ‌త ప‌గ‌లేదు. ఒక‌ప్ప‌టితో పోల్చుకుంటే ఇప్ప‌టి పేస్ బౌల‌ర్లు అంత ప్ర‌భావ‌వంతంగా బౌలింగ్ చేయ‌లేకపోతున్నారని అన్న‌. నా వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నారు` అని ర‌జాక్ చెప్పాడు. గ‌తంలో బుమ్రాను ర‌జాక్ బేబీ బౌల‌ర్ అన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.logo