సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 25, 2020 , 14:38:36

ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయిన క‌పిల్ దేవ్

ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయిన క‌పిల్ దేవ్

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ సార‌థి క‌పిల్ దేవ్ రెండు రోజుల క్రితం గుండెపోటుతో ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్‌ హార్ట్ ఆసుప‌త్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో గుండెపోటు రావ‌డంతో అత్యవసరంగా యాంజియోప్లాస్టీ చేశారు.  గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు మూసుకుపోవడంతో  యాంజియోప్లాస్టీ ద్వారా వాటిని పునరుద్ధరించారు. ప్ర‌స్తుతం క‌పిల్ ఆరోగ్యం కాస్త కుదుట‌ప‌డ‌డంతో కొద్ది సేప‌టి క్రితం డిశ్చార్జ్ చేశారు. ఈ విష‌యాన్ని మాజీ క్రికెట‌ర్ చేత‌న్ శ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.  క‌పిల్ దేవ్‌తో డాక్ట‌ర్ దిగిన ఫోటోని కూడా త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు చేత‌న్. అంద‌రి ప్రార్ధ‌న‌ల‌తో క‌పిల్ క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌డంతో క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.