శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Nov 06, 2020 , 22:39:49

పోరాడుతున్న విలియమ్సన్‌

 పోరాడుతున్న విలియమ్సన్‌

అబుదాబి: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 132  పరుగుల లక్ష్య ఛేదనలో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తడబడుతోంది.   బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తున్నారు.  కీలక బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరడంతో హైదరాబాద్‌పై ఒత్తిడి పెరిగింది. కేన్‌ విలియమ్సన్‌ ఇన్నింగ్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు.  ఎక్కువగా  విలియమ్సన్‌ స్ట్రైకింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు.   

గోస్వామీ(0), డేవిడ్‌ వార్నర్‌(17), మనీశ్‌ పాండే(24) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. 15 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ 4 వికెట్లకు  87 పరుగులు చేసింది. జట్టుకు విజయాన్ని అందించాలని విలియమ్సన్‌ పట్టుదలతో  ఉన్నాడు. ప్రస్తుతం విలియమ్సన్‌(24), జేసన్‌ హోల్డర్‌(5) క్రీజులో ఉన్నారు.