Sports
- Feb 04, 2021 , 02:48:39
VIDEOS
భారత్‌కు హ్యాట్సాఫ్

న్యూఢిల్లీ: ఆసీస్ గడ్డపై టీమ్ఇండియా టెస్టు సిరీస్ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుందని న్యూ జిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ పేర్కొన్నాడు. భారత జట్టు ఎన్నో ప్రతికూలతల మధ్య చిరస్మరణీయ విజయం సాధించిందని ప్రశంసించా డు. ‘ఆస్ట్రేలియా గడ్డపై ఆడటం అంటే సవాలుతో కూడుకున్న విషయం. అలాంటిది ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. టీమ్ఇండియా అక్కడ అద్భుత ప్రదర్శన చేసింది. గాయాలతో ప్రధాన ఆటగాళ్లు దూరమైనా సిరీస్ పట్టేసింది. టెస్టు చాంపియన్‌షిప్ పోటీలో నిలవడానికి గొప్పగా పోరాడింది. గబ్బాలో జరిగిన చివరి టెస్టులో పెద్దగా అనుభవం లేని బౌలింగ్ దళంతో బరిలోకి దిగి గెలిచింది. ఆ విజయంతో భారతదేశమంతా గొప్ప అనుభూతి చెంది ఉంటుంది. కేవలం అభిమానులే కాదు, ఆటగాళ్లూ ఆ విజయాన్ని బాగా ఆస్వాదించి ఉంటారు’ అని విలియమ్సన్ అన్నాడు.
తాజావార్తలు
- అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!
- పక్కాగా మహా శివరాత్రి జాతర ఏర్పాట్లు
- బ్రాహ్మణ పక్షపాతి సీఎం కేసీఆర్ : ఎమ్మెల్సీ కవిత
MOST READ
TRENDING