పటియాల (పంజాబ్): భారత డిస్కస్త్రోవర్ కమల్‌ప్రీత్ కౌర్ సత్తాచాటింది. జాతీయ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్‌లో జాతీయ రికార్డు నెలకొల్పడంతో పాటు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల పోటీలో తొలి ప్రయత్నంలోనే డిస్క్‌ను 65.06 మీటర్లు విసిరిన కమల్‌ప్రీత్ స్వర్ణ పతకం సాధించింది. ఒలింపిక్స్ అర్హత మార్కు (63.5 మీ.)ను సునాయాసంగా అధిగమించడంతో పాటు గతంలో కృష్ణ పునియా పేరిట ఉన్న జాతీయ రికార్డు (64.76 మీ.)ను కౌర్ బద్దలుకొట్టింది.