సోమవారం 30 నవంబర్ 2020
Sports - Nov 08, 2020 , 22:01:40

సన్‌రైజర్స్‌కు షాక్‌.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు

 సన్‌రైజర్స్‌కు షాక్‌.. ఒకే  ఓవర్లో రెండు వికెట్లు

అబుదాబి: క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్దేశించిన 190 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.  రబాడ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే సన్‌రైజర్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. మొదటి బంతికే డేవిడ్‌ వార్నర్‌(2) బౌల్డ్‌ అయ్యాడు. నోర్ట్జే వేసిన మూడో ఓవర్లో మనీశ్‌ పాండే ఫోర్‌.. ప్రియం గార్గ్‌ సిక్సర్‌ బాదడంతో 11 పరుగులు వచ్చాయి. వీరిద్దరూ వీలుచిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడే ప్రయత్నం చేశారు. 

స్టాయినీస్‌ వేసిన ఐదో ఓవర్లో ప్రియం గార్గ్‌(17) కూడా బౌల్డ్‌ అయ్యాడు. అదే ఓవర్‌ ఆఖరి బంతికి మనీశ్‌ పాండే(21).. నోర్ట్జేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరడంతో మ్యాచ్‌పై ఢిల్లీ పట్టు సాధించింది.  5 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 3 వికెట్ల నష్టానికి 44 పరుగులు చేసింది.