శుక్రవారం 27 నవంబర్ 2020
Sports - Nov 17, 2020 , 02:00:50

జోరుగా టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌

జోరుగా టీమ్‌ఇండియా ప్రాక్టీస్‌

సిడ్నీ: ఆస్ట్రేలియాతో పోరు కోసం టీమ్‌ఇండియా ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. సిడ్నీ మైదానంలోని నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడిన బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ సోమవారం టెన్నిస్‌ బంతులతో ప్రాక్టీస్‌ చేశాడు. బౌన్సర్లను బాదేందుకు పుల్‌షాట్లకు పదునుపెట్టాడు. అశ్విన్‌  టెన్నిస్‌ బ్యాట్‌తో బంతులను సంధించగా.. రాహుల్‌  సమర్థంగా ఆడాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. మరోవైపు ఆసీస్‌తో డే అండ్‌ నైట్‌ టెస్టు కోసం పేసర్‌ షమీ అప్పుడే గులాబీ బంతితో సన్నాహకాలు ప్రారంభించా డు. ఈ నెల 27 నుంచి జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల్లోనూ చోటు దక్కించుకున్నా.. డిసెంబర్‌ 17 నుంచి అడిలైడ్‌లో జరిగే డే అండ్‌ నైట్‌ టెస్టుపైనే షమీ ఎక్కువ దృష్టిసారించాడు.