శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Mar 22, 2020 , 23:34:10

కష్టమంతా వృథా అయినట్లే..

 కష్టమంతా వృథా అయినట్లే..

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌ (2020) షెడ్యూల్‌ ప్రకారం జరుగాలని భారత స్టార్‌ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను కోరుకుంటున్నది. ఒకవేళ విశ్వక్రీడలు వాయిదా పడితే.. ఇన్నాళ్లు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుందని ఆమె పేర్కొంది. ‘ఒలింపిక్స్‌ షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించకపోతే.. నాలుగేండ్ల కష్టం వృథా అవుతుంది. అందుకే ఆటలు సజావుగా సాగాలని దేవుడిని ప్రార్థిస్తున్నా. విశ్రాంతి, శిక్షణలాంటి అంశాల గురించి ఆలోచించడం లేదు. ఒలింపిక్‌ మెడల్‌ సాధించడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం. అందుకోసం చాలాకాలంగా కష్టపడుతున్నా. విశ్వక్రీడలు వాయిదా పడితే అంతా మారిపోతుంది’ అని మీరాబాయి పేర్కొంది.


logo