శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Sep 15, 2020 , 19:21:29

అచ్చం క్రిస్ గేల్.. కాదు కాదు యువరాజ్ సింగ్.. వీడియో

అచ్చం క్రిస్ గేల్.. కాదు కాదు యువరాజ్ సింగ్.. వీడియో

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా.. గతంలో చిన్న పిల్లలు అందమైన క్రికెట్ షాట్లు ఆడుతున్న వీడియోలను షేర్ చేశారు. ప్రస్తుతం మరోసారి మరో చిచ్చరపిడుగు వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు.

కామెంటరేటర్ గా మారిని ఈ మాజీ క్రికెటర్ .. ఓ పిల్లవాడు బంతిని ఎంత శక్తివంతంగా కొడుతున్నది చూసి ఆశ్చర్యపోయాడు. ఈ పిల్లాడి ప్రతిభను ప్రశంసిస్తూ "ఈ చిన్న పిల్లవాడు ఎంత బాగున్నాడు !!!" అని ఆకాశ్ కామెంట్ రాశాడు. మెట్ల మీద నిలబడి  ఎడమ చేతి వాటంతో బంతిని బాదుతున్న పిల్లవాడిని వీడియోను చూస్తే భవిష్యత్ ఆశాకిరణంగా మనకు అనిపిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బుడతడు నిలబడే తీరు, బంతిని కొడుతున్న విధానం, షాట్లను ఎంచుకునే రకం.. ఇలా ఎన్నో విధాలుగా ఆకట్టుకుంటున్నాడు.  పిల్లాడి పవర్-హిట్టింగ్‌ వీడియోను చూసిన ఓ నెటిజెన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు చెందిన క్రిస్ గేల్‌తో పోల్చగా.. 2007 లో వరల్డ్ టీ-20 లో యువరాజ్ సింగ్ కొట్టిన ఆరు సిక్సర్లను గుర్తుచేస్తున్నాయని మరో నెటిజన్ ప్రశంసల్లో ముంచెత్తాడు.

గత నెలలో కూడా ఆకాశ్ చోప్రా ఒక చిన్న అమ్మాయి ఎంఎస్ ధోని ఐకానిక్ హెలికాప్టర్ షాట్ ఆడుతున్న వీడియోను పంచుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.logo