శనివారం 30 మే 2020
Sports - Mar 29, 2020 , 23:56:52

వచ్చే ఏడాది జూలైలోనే..

వచ్చే ఏడాది జూలైలోనే..

  • టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం !
  • జపాన్‌ మీడియా వెల్లడి

టోక్యో: కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన టోక్యో ఒలింపిక్స్‌ షెడ్యూల్‌ ఎలా ఉంటుందో అన్న అంశంపై అన్ని క్రీడా సమాఖ్యలతో పాటు అథ్లెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జూలైలోనే టోక్యో విశ్వక్రీడలు ప్రారంభమవుతాయని జపాన్‌ మీడియా ఆదివారం వెల్లడించింది. 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు విశ్వక్రీడలు జరుగుతాయని జపాన్‌ బ్రాడ్‌కాస్టర్‌ ఎన్‌హెచ్‌కే తెలిపింది. 

పెద్ద తేడా ఉండదు: యషిరో 

ఈ ఏడాది షెడ్యూల్‌తో పోలిస్తే వచ్చే ఏడాది విశ్వక్రీడలు నిర్వహించే తేదీల్లో పెద్ద తేడా ఉండకపోవచ్చని టోక్యో ఒలింపిక్స్‌ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యషిరో మోరీ చెప్పారు. క్రీడలు వేసవిలోనే జరగాలి. జూన్‌ - సెప్టెంబర్‌ మధ్య నిర్వహించాలనుకుంటున్నాం అని యషిరో చెప్పారు. ప్రస్తుతం ఐవోసీతో చర్చిస్తున్న ఆయన.. వారంలోగా నిర్ణయం ఓ కొలిక్కి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకు జరగాల్సిన విశ్వక్రీడలను.. కరోనా వైరస్‌ విజృంభించడంతో  వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ ఐవోసీ గత గురువారం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 


logo