సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Aug 31, 2020 , 17:19:25

జూలన్‌ గోస్వామి 10 వికెట్ల రికార్డుకు నేటితో 14 ఏండ్లు

జూలన్‌ గోస్వామి 10 వికెట్ల రికార్డుకు నేటితో 14 ఏండ్లు

2006లో సరిగ్గా ఇదే రోజు ప్రముఖ పేసర్ జూలన్‌ గోస్వామి ఒక టెస్ట్ మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. టౌంటన్‌లోని ది కూపర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టెస్టులో టీమిండియా ఇంగ్లండ్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సమయంలో గోస్వామి ఈ ఘనతను సాధించింది. 37 ఏళ్ల వయస్సులో టెస్ట్ మ్యాచ్‌లో ఈ మైలురాయిని సాధించిన ఏకైక మహిళా క్రికెటర్‌గా ఈ బెంగాల్ పేసర్ నిలిచింది. ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. 

అంజుమ్ చోప్రా 98 పరుగులు, కెప్టెన్ మిథాలీ రాజ్ 65 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ ఐదు వికెట్ల తేడాతో 307 పరుగులు చేసిన తర్వాత గోస్వామి ఐదు వికెట్లు తీయడంతో ఇంగ్లండ్‌ 99 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఆ తరువాత ఫాలో-ఆన్‌ ఆడిన ఇంగ్లండ్‌ రెండో రోజుకు 305 స్కోరు చేయగా భారత్‌ కంటే 98 పరుగుల ఆధిక్యంలో ఉంది. 

రెండో ఇన్నింగ్స్‌లో కూడా గోస్వామి కేవలం 48 పరుగులిచ్చి 5 వికెట్లు తీసింది. 29.2 ఓవర్లలో ఛేజింగ్‌ ఆడిన భారత్ ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచింది. తొలి మ్యాచ్ డ్రాగా ముగిసిన తర్వాత రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo