శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Aug 08, 2020 , 02:30:57

రసవత్తరంగా.. ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ తొలి టెస్టు

 రసవత్తరంగా.. ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ తొలి టెస్టు

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. పాక్‌ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 219 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 92/4తో మూడో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌.. కాసేపటికే ఒలీ పోప్‌ (62) వికెట్‌ కోల్పోయింది. లోయర్‌ ఆర్డర్‌లో బట్లర్‌ (38), బ్రాడ్‌ (29), వోక్స్‌ (19) తాలా కొన్ని పరుగులు చేయడంతో.. ఇంగ్లండ్‌ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పాక్‌ బౌలర్లలో యాసిర్‌ షా 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాకిస్థాన్‌ టాపార్డర్‌ తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీతో ఆకట్టుకున్న షాన్‌ మసూద్‌ (0) డకౌట్‌ కాగా.. బాబర్‌ ఆజమ్‌ (5) విఫలమయ్యాడు. ఆబిద్‌ అలీ (20), కెప్టెన్‌ అజహర్‌ అలీ (18), అసద్‌ షఫీఖ్‌ (29), రిజ్వాన్‌ (27), షాదాబ్‌ ఖాన్‌ (15) తలా కొన్ని పరుగులు చేయడంతో ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్‌ 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.


logo