మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 16, 2020 , 00:07:03

జోష్నకు 18వ నేషనల్‌ టైటిల్‌

జోష్నకు 18వ నేషనల్‌ టైటిల్‌

చెన్నై: స్టార్‌ స్కాష్‌ ప్లేయర్‌ జోష్నా చినప్ప 18వసారి జాతీయ చాంపియన్‌ టైటిల్‌ గెలుచుకుంది. తమిళనాడు వేదికగా జరిగిన సీనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో జోష్న 3-1 (8-11, 11-6, 11-4, 11-7)తో తన్వీ ఖన్నాపై విజయం సాధించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత స్కాష్‌ను ముందుండి నడిపిస్తున్న జోష్న శనివారం జరిగిన తుదిపోరులో తొలి గేమ్‌ కోల్పోయాక అద్భుతంగా పుంజుకొని మూడు గేమ్‌లు నెగ్గి విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో సౌరవ్‌ ఘోషల్‌ 3-0 (11-6, 11-5, 11-6)తో అభిషేక్‌పై గెలిచి 13వ సారి విజేతగా నిలిచాడు.


logo
>>>>>>