ఆదివారం 29 నవంబర్ 2020
Sports - Oct 15, 2020 , 03:20:37

ఈజిప్ట్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో జోష్న

ఈజిప్ట్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో జోష్న

కైరో: ఈజిప్టు ఓపెన్‌లో భారత స్వాష్‌ స్టార్‌ జోష్న చినప్ప క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ పోరులో జోష్న 11-7, 11-6, 7-11, 10-12, 11-9 తేడాతో ఫరీదా మహమ్మద్‌(ఈజిప్టు)పై విజయం సాధించింది. మూడు, నాలుగు గేమ్‌ల్లో ఊహించని ప్రతిఘటన ఎదురైనా తప్పక గెలువాల్సిన పరిస్థితిలో నిర్ణయాత్మక ఐదో గేమ్‌లో జోష్న సత్తాచాటింది. క్వార్టర్స్‌లో  రెండో   షెర్బినితో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో సౌరవ్‌ ఘోశల్‌  8-11, 9-11, 8-11తో మెజాన్‌ హషెమ్‌ చేతిలో ఓడాడు.