గురువారం 26 నవంబర్ 2020
Sports - Oct 06, 2020 , 22:51:24

MI vs RR: రాజస్థాన్‌ ఓపెనర్‌ బట్లర్‌ మెరుపులు

MI vs RR: రాజస్థాన్‌ ఓపెనర్‌  బట్లర్‌  మెరుపులు

అబుదాబి:  రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌(70: 44 బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు) అర్ధశతకంతో చెలరేగాడు.   ముంబై ఇండియన్స్‌  నిర్దేశించిన 194  పరుగుల  లక్ష్య ఛేదనలో  రాజస్థాన్‌  12/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో బట్లర్‌ ఆకాశమే హద్దుగా విజృంభించాడు. ముంబై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.  రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో సిక్సర్‌ బాది 34 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

మరో ఎండ్‌లో టామ్‌ కరన్‌ బట్లర్‌కు సహకారం అందించాడు.  జట్టును ముందుండి నడిపిస్తున్న బట్లర్..‌ పాటిన్సన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 14వ ఓవర్‌ మూడో బంతిని భారీ షాట్‌ ఆడిన బట్లర్‌  బౌండరీ లైన్‌ వద్ద పొలార్డ్‌ అద్భుత క్యాచ్‌కు నిష్క్రమించాడు.    14 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్‌ 102 పరుగులు చేసింది.   కరన్‌(8), రాహుల్‌ తెవాటియా(4) క్రీజులో ఉన్నారు.