సోమవారం 28 సెప్టెంబర్ 2020
Sports - Aug 22, 2020 , 18:52:21

ENGvPAK:రెండేండ్ల తర్వాత టెస్టు సెంచరీ సాధించిన బట్లర్‌

ENGvPAK:రెండేండ్ల తర్వాత టెస్టు సెంచరీ సాధించిన బట్లర్‌

సౌతాంప్టన్‌:  పాకిస్థాన్‌తో ఆఖరిదైన మూడో టెస్టులో వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. తనపై వస్తున్న విమర్శలకు  గొప్ప ప్రదర్శనతోనే సమాధానమిచ్చాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 87తో రెండో రోజు ఇన్నింగ్స్‌ ఆరంభించిన బట్లర్‌ ఆత్మవిశ్వాసంతో 189 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. టెస్టు కెరీర్‌లో ఇది రెండోది. 2018 ఆగస్టులో భారత్‌తో టెస్టులో బట్లర్‌  తొలి టెస్టు సెంచరీ సాధించాడు.  రెండేండ్ల తర్వాత బట్లర్‌ మళ్లీ టెస్టు సెంచరీ సాధించాడు.

వెస్టిండీస్‌తో సిరీస్‌లో బట్లర్‌ విఫలమవడంతో అతనిపై విమర్శలు వచ్చాయి. బట్లర్‌, మరో బ్యాట్స్‌మన్‌ జాక్‌ క్రాలీ  246 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీళ్లిద్దరూ భారీ ఇన్నింగ్స్‌లతో చెలరేగడంతో ఇంగ్లాండ్‌ పటిష్ఠస్థితిలో నిలిచింది. లంచ్‌ విరామ సమయానికి ఇంగ్లాండ్‌ 108 ఓవర్లలో 4 వికెట్లకు 373 పరుగులు చేసింది. క్రాలీ(186), బట్లర్‌(113) క్రీజులో ఉన్నారు. ఈ జోడీని విడదీసేందుకు పాక్‌ బౌలర్లు శ్రమిస్తున్నారు. 


logo