మంగళవారం 01 డిసెంబర్ 2020
Sports - Oct 24, 2020 , 23:44:54

స‌న్‌రైజర్స్‌పై పంజాబ్‌ ఉత్కంఠ విజయం

స‌న్‌రైజర్స్‌పై పంజాబ్‌   ఉత్కంఠ విజయం

దుబాయ్‌: ఐపీఎల్-13లో  కేఎల్‌ రాహుల్‌ సారథ్యంలోని కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు వరుసగా నాలుగో విజయం సాధించింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను 12 పరుగుల తేడాతో ఓడించింది.  127 పరుగుల లక్ష్య ఛేదనలో  హైదరాబాద్‌ 19.5 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది.  డెత్‌ఓవర్లలో ప్రత్యర్థిని కుప్పకూల్చిన క్రిస్‌ జోర్డాన్‌(3/17) మ్యాచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.  యువ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌(3/23) హైదరాబాద్‌ను కట్టడి చేశాడు.  డేవిడ్‌ వార్నర్‌(35), విజయ్‌ శంకర్‌(26) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. 

అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 126 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది. నికోలస్‌ పూరన్‌(32 నాటౌట్:‌ 28 బంతుల్లో 2ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌(27), క్రిస్‌ గేల్‌(20) చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు.  ఆఖర్లో పూరన్‌ స్ఫూర్తిదాయక ప్రదర్శన చేయడంతో పంజాబ్‌    గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.  హైదరాబాద్‌ బౌలర్లలో సందీప్‌ శర్మ(2/29), జేసన్‌ హోల్డర్‌(2/27), రషీద్‌ ఖాన్‌(2/14) తలో రెండు వికెట్లు పడగొట్టి  పంజాబ్‌ను దెబ్బకొట్టారు.