శనివారం 28 నవంబర్ 2020
Sports - Oct 04, 2020 , 18:18:00

MI vs SRH:చెలరేగి ఆడుతున్న సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్

MI vs SRH:చెలరేగి ఆడుతున్న   సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్

షార్జా: ముంబై ఇండియన్స్‌ నిర్దేశించిన 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన ఐదో ఓవర్లో భారీ షాట్‌ ఆడిన జానీ బెయిర్‌స్టో(25) బౌండరీలైన్‌ వద్ద హార్దిక్‌ పాండ్య  చేతికి చిక్కాడు. తొలి ఓవర్‌ నుంచే బెయిర్‌స్టో  ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.  పవర్‌ప్లేలో    సన్‌రైజర్స్‌  56 రన్స్‌ రాబట్టింది.  ఛేదనను ఘనంగా ఆరంభించిన సన్‌రైజర్స్‌ లక్ష్యం దిశగా సాగుతోంది.

రాహుల్‌ చాహర్‌ వేసిన 9వ ఓవర్లో పాండే, వార్నర్‌  చెరో సిక్సర్‌ బాది 16 రన్స్‌ రాబట్టారు. 9 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ వికెట్‌ నష్టానికి 86 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే(29), డేవిడ్‌ వార్నర్‌(27)  మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారు.  వార్నర్‌ సహకారం అందిస్తుండటంతో పాండే రెచ్చిపోతున్నాడు.