ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Sports - Aug 03, 2020 , 17:57:27

ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్​గా ట్రాట్​

ఇంగ్లండ్ బ్యాటింగ్ కోచ్​గా ట్రాట్​

లండన్​: పాకిస్థాన్​తో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్​గా మాజీ బ్యాట్స్​మన్ జొనాథన్ ట్రాట్​ నియమితుడయ్యాడు. బుధవారం ఈ సిరీస్​ ప్రారంభం కానుంది. తన కెరీర్​లో ఇంగ్లండ్ తరఫున 52 టెస్టులు ఆడిన ట్రాట్​ 3835 పరుగుల చేశాడు. అలాగే 68వన్డేలు, 7టీ20లు ఆడాడు. అయితే ఫస్ట్​ క్రికెట్​లో 18,662 పరుగులు చేసి మంచి టెస్టు క్రికెటర్​గా పేరుతెచ్చున్నాడు. కాగా ఇంగ్లండ్​, పాకిస్థాన్ మధ్య మూడు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్ మాంచెస్టర్​ వేదికగా బుధవారం ప్రారంభం కానుంది. కరోనా వైరస్ నేపథ్యంలో బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండానే ఈ సిరీస్ జరుగనుంది. ఇటీవలే సొంతగడ్డపై టెస్టు సిరీస్​లో వెస్టిండీస్​ను 2-1తేడాతో ఓడించిన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు మంచి ఫామ్​లో ఉంది. 


logo