పారిస్: సెర్బియా వీరుడు నోవాక్ జొకోవిచ్.. అభిమాని హృదయాన్ని గెలుచుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో అర్ధ శతాబ్ద కాలంలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న జొకో..తన విజయాన్ని చిరస్మరణీయం చేసుకున్నాడు. ఫైనల్ పోరులో ఉత్కంఠ గెలుపు సొంతం చేసుకున్న జొకో..స్టాండ్స్‌లో ఉన్న కుర్ర అభిమానికి తన రాకెట్ ఇచ్చాడు. ఊహించని రీతిలో తన ఆరాధ్య ఆటగాన్నుంచి బహుమతి అందుకున్న ఆ బుడ్డోని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.