గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Aug 05, 2020 , 03:35:59

యువ సైక్లిస్ట్‌ మృతి

 యువ సైక్లిస్ట్‌ మృతి

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన యువ సైక్లిస్ట్‌ జాన్‌ రీడ్‌మాన్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. 17 ఏండ్ల రీడ్‌మాన్‌ సోమవారం ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో కారు ఢీ కొట్టడంతో కన్నుమూశాడు. బోరా-హాన్స్‌గ్రోకు చెందిన ఆటో ఎడర్‌బయెర్న్‌ జట్టులో సభ్యుడైన రీడ్‌మాన్‌.. అండర్‌-19 వరల్డ్‌ టూర్‌కు ఎంపికయ్యాడు. చక్కటి భవిష్యత్తు ఉన్న రీడ్‌మాన్‌ మృతిచెందడం కలిచివేసిందని బోరా-హాన్స్‌గ్రో ట్వీట్‌ చేసింది.


logo