గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 06, 2020 , 23:18:52

ఐపీఎల్‌ నుంచి ఆర్చర్‌ ఔట్‌

 ఐపీఎల్‌ నుంచి ఆర్చర్‌ ఔట్‌

లండన్‌: మోచేతికి గాయం కారణంగా ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఆటగాడు జోఫ్రా ఆర్చర్‌ ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు గురువారం ప్రకటించింది. జట్టులో ప్రధాన పేసర్‌గా ఉన్న ఆర్చర్‌ దూరమవడంతో రాయల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. జోఫ్రా దాదాపు మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉండగా, తదుపరి శ్రీలంక పర్యటనకు సైతం దూరమయ్యాడు. గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులోనే కుడి మోచేతి గాయం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డ ఆర్చర్‌ ఆ తర్వాతి మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు. 


logo
>>>>>>