శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Oct 11, 2020 , 16:43:45

SRH vs RR: డేవిడ్‌ వార్నర్‌ ఔట్‌..

SRH vs RR: డేవిడ్‌ వార్నర్‌    ఔట్‌..

దుబాయ్‌: రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అర్ధసెంచరీకి చేరువలో ఔటయ్యాడు.   ఆరంభం నుంచి  రాజస్థాన్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ  పరుగులు రాబట్టాడు. రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో  వేగంగా  ఆడేందుకు ప్రయత్నించిన వార్నర్‌..జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఓవర్‌ నాలుగో బంతిని భారీ షాట్ ఆడబోయి బౌల్డ్‌  అయ్యాడు.  రెండో వికెట్‌కు వార్నర్‌, మనీశ్‌ పాండే జోడీ  73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.      15 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 2 వికెట్లకు 96 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే(), కేన్‌ విలియమ్సన్‌() క్రీజులో ఉన్నారు.